రాధా కృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు వాయిస్ ఇవ్వబోతున్నారు అంటూ మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు ఇతర భాషలకు సంబంధించి వాయిస్ ఇచ్చేది ఎవరు అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, పృథ్వీరాజ్, శివ రాజ్ కుమార్ తెలుగు, మలయాళం, కన్నడ వెర్షన్లకు వాయిస్ అందించనున్నారు.
అయితే ఈ చిత్రానికి తమిళంలో ఎవరు వాయిస్ ఇస్తారనేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. భారీ బడ్జెట్ తో యూవి క్రియేషన్స్, టి సిరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.
Heartful thanks to @ssrajamouli sir, @NimmaShivanna sir, and @PrithviOfficial sir for the voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations #BhushanKumar @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/pNmxoMTfIA
— Radhe Shyam (@RadheShyamFilm) February 27, 2022