మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152 వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారని, ఇప్పటికే చరణ్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో చిరు కనిపించారు. ఆ తరువాత కూడా బ్రూస్లీ సినిమాలో కూడా చిరు కనిపించాడు. ఇప్పుడు కొంచెం రివర్స్ లో చిరు సినిమాలో చరణ్ కనిపించబోతున్నాడు. అయితే చరణ్ ఏదో ఒకసారి వచ్చి కనిపించినట్టు కాకుండా ఏకంగా చరణ్ పై 25 నిమిషాల నిడివిలో కనిపించనున్నాడట.
మరో వైపు రాంచరణ్, ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. ఈ సినిమా పూర్తి అయ్యేవరకు చరణ్, ఎన్టీఆర్ తన కనుసన్నల్లోనే ఉండాలని, వేరొక సినిమాకు పని చెయ్యకూడదని షరతులు పెట్టాడట. RRR సినిమా రిలీజ్ అయ్యేవరకు చరణ్ వేరొక సినిమా సెట్స్ పైకి వెళ్ళటానికి వీలులేదని రాజమౌళి గట్టిగా చెప్పటంతో RRR షూటింగ్ ముగిసేవరకు చిరు సినిమాకు బ్రేక్ పడినట్టే.
దీంతో RRR షూటింగ్ పూర్తయ్యే వరకు చిరు సినిమా ఆగిపోకుండా… సినిమా షూటింగ్ పూర్తి చేసి, చరణ్‌పై తీసే షాట్స్‌ను మాత్రం వాయిదా వేయబోతున్నారు. సినిమా పూర్తయ్యే సమయానికి చరణ్‌పై షూటింగ్ మొదలుకాబోతుంది.