యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వస్తున్న సినిమా RRR. బాహుబలి లాంటి ప్యాన్ ఇండియా లెవెల్ మూవీ తరువాత రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2020 జులై 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లూరిసీతారామ రాజుగా రాంచరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా నటిస్తున్నారు.
RRR చిత్రాన్ని సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని నిర్మాత దానయ్య చెప్పారు. దీన్ని బట్టి భారీ రేంజులోనే అన్ని భాషల్లోనూ ప్రీరిలీజ్ బిజినెస్ సాగించాల్సి ఉంటుంది. ఇంకా విడుదలకి ఆరునెలల వ్యవధి ఉంది కాబట్టి ఈ ప్రీరిలీజ్ బిజినెస్‌లో మరెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి మరి. ప్రస్తుతం ఇంటర్వెల్ సీన్ లో ఓ ఫైట్ ను చిత్రీకరిస్తున్నాడట రాజమౌళి. ఈ ఒక్క ఫైట్ కు గాను 45 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఫైట్ సీన్ లో మొత్తం ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు 2000 మంది పాల్గొంటున్నారట. సినిమా మొత్తానికి ఈ ఫైట్ సీన్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.