ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. అటు ఓటీటీలోకి కూడా సినిమా వచ్చేసింది. దీంతో రాజమౌళి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమాపై పెట్టాడు.
ఆర్ఆర్ఆర్ రిలీజైన వెంటనే విదేశాలకు వెళ్లిపోయాడు రాజమౌళి. దాదాపు నెల రోజుల పాటు ఫారిన్ లొకేషన్ లో ఉన్నాడు. అలా పూర్తిగా ఇండియాకు దూరైన రాజమౌళి, తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. మహేష్ బాబు సినిమా పని మొదలుపెట్టబోతున్నాడు.
మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే 5-6 స్టోరీలైన్స్ అనుకున్నారు కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. త్వరలోనే ఆ స్టోరీలైన్స్ పై కూర్చుంటారు తండ్రికొడుకులు. అందులో ఒకదాన్ని పిక్ చేసి, ఆ లైన్ ను మహేష్ ను నెరేట్ చేయబోతున్నారు.
ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ సినిమా పనిలో ఉన్నాడు. జులై నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుంది. వచ్చే ఏడాది రాజమౌళి సినిమాకు మహేష్ కాల్షీట్లు కేటాయించాడు. రాజమౌళి కోసం ఏకంగా 16 నెలల టైమ్ కేటాయించాడు మహేష్. ఈ 16 నెలల్లో మరో సినిమా చేయడు.
ఇటు రాజమౌళి కూడా ఈ ఏడాదంతా కథపై వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మహేష్ ఓకే చెప్పిన లైన్ పై కనీసం 5 నెలలు కూర్చున్న తర్వాత, అప్పుడు సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ లో ఉన్నాడు.