కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయపెట్టిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. కరోనా వైరస్ సోకి వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. అలాగే రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవ్వడం ప్రపంచ దేశాలను మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ కారణంగా ప్రజల్లో ఒకరకమైన అభద్రతభావం కనిపిస్తోంది. ఈనెలలో కరోనా కేసులు తెలంగాణలో కూడా నమోదు అయ్యాయి. దాంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. ఈ వైరస్ నివారణ కోసం తెలంగాణలోని స్కూల్స్, బార్లు, మాల్స్, థియేటర్లను ఈనెల 31వరకు మూసివేయాలని జీవో జారీ చేశారు. ఇక, ఈ వైరస్ అని రంగాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పించాయి. అలాగే కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా కనిపిస్తోంది. కొన్ని సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
కరోనాపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. కరోనా కారణంగా ప్రపంచమే స్థంభించి పోవడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు వ్యాధి నివారణకు ఏమి చేయాలో అది చేస్తే బాగుంటుందని సూచించారు రాజమౌళి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ పై పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విదేశీ నటులు కూడా నటిస్తున్నారు. కారోనా కారణంగా కేంద్రం విదేశీయుల వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై దాని ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో.. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేస్తారా లేదా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
It's shocking to see the world come to a standstill. However, in a scenario like this it's imperative to avoid spreading panic. Follow the standard recommendations to prevent the spread of the #COVID19 infection and stay alert. https://t.co/dzzDfuDP9k
— rajamouli ss (@ssrajamouli) March 16, 2020