కేసీఆర్ పై జక్కన్న ట్వీట్... - Tolivelugu

కేసీఆర్ పై జక్కన్న ట్వీట్…

కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో అన్నిరంగాలతో పాటు సినీ రంగంలో కూడా బ్రేక్ పడింది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లకు పర్మిషన్ లు వస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రిని టాలీవుడ్ ప్రముఖులు కలిశారు. ఇదే విషయమై దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్ చేశాడు.
చిత్ర పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ఎంతో సానుభూతితో స్పందించారని రాజమౌళి వెల్లడించారు.

తాము చెప్పిన అంశాలను ఎంతో ఓపిగ్గా విన్నారని, ఊరట కలిగించేలా మాట్లాడారని తెలిపారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ పునఃప్రారంభానికి తగిన విధానం రూపొందిస్తామని చెప్పారని రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp