దర్శక ధీరుడు రాజమౌళి ఇంటికి ఓ అతిథి వచ్చింది. అయితే అది మనిషి కాదు, ఓ అందమైన కారు. అవును.. వోల్వో కంపెనీకి చెందిన హైఎండ్ మోడల్ కారు రాజమౌళి ఇంటికి చేరుకుంది. ఎరుపు రంగులో ధగధగలాడిపోతున్న ఈ కారును రాజమౌళి ఇంటికి డెలివరీ చేశారు కంపెనీ ప్రతినిధులు. ఈ సందర్భంగా జక్కన్నతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సౌత్ లో అత్యథిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కోసం అతడు భారీ పారితోషికం అందుకున్నాడు. ఎక్కువగా తన డబ్బును భూములు, ఇళ్లపై పెట్టడం రాజమౌళికి ఇష్టం. ఇంకా మిగిలితే కార్లు కొనుగోలు చేస్తుంటాడు. అయితే ఖరీదైన బెంజ్ కార్లను కొనేందుకు ఆయన ఇష్టపడరు.
ఇందులో భాగంగా వోల్వో కంపెనీ కారును కొనుగోలు చేశారు రాజమౌళి. దీని ఖరీదు అటుఇటుగా 50 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే ఈ కారును తన వినియోగం కోసం కొన్నారా లేక కొడుకు కార్తికేయ లేదా భార్య రమాకు ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, రాజమౌళి దగ్గర ఆల్రెడీ ఓ కొత్త కారు ఉంది.
ప్రస్తుతం ఈ దిగ్గజ దర్శకుడు.. ఫ్రీ టైమ్ తీసుకున్నాడు. మరికొన్ని రోజులు రిలాక్స్ అయి, అప్పుడు మహేష్ బాబు సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తాడు. మహేష్ తో మూవీకి సంబంధించి రాజమౌళి ఇంకా స్టోరీ డిస్కషన్లు స్టార్ట్ చేయలేదు. రీసెంట్ గా సర్కారువారి పాట షూట్ పూర్తిచేసిన మహేష్.. మరికొన్ని రోజుల్లో రాజమౌళికి అపాయింట్ మెంట్ ఇవ్వబోతున్నారు.