టాలీవుడ్ లో రాజమౌళి సినిమా అంటే చాలు ఫాన్స్ కి పండుగే. ఆయన ప్రత్యేకంగా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే పరిస్థితి ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. రెండు లేదా మూడు నెలల్లో ఈ సినిమా షూట్ పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కోసం జక్కన్న ఒక కీలక స్టెప్ వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన సినిమాలో కూడా లేడీ విలన్ ను తీసుకోలేదు. కాని ఈ సినిమాలో నాగిని సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మౌని రాయ్ ని విలన్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఆమెకు ఇప్పటికే కథ కూడా చెప్పారని, ఆమె తో షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె రాజకీయ నాయకురాలిగా ఉంటారని టాక్ నడుస్తుంది. మహేష్ బాబుకి ఆమెకు మధ్య చిత్రీకరించే సన్నివేశాలను అనంతపురం జిల్లాలో షూట్ చేసే అవకాశం ఉందని సమాచారం. మహేష్ బాబు… సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు.