దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవగన్, శ్రీయా శరణ్ కీలక పాత్రలలో నటించారు. మార్చి 25న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని వసూళ్ల సునామీ సృష్టించింది.
అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి సినిమాలోనూ తప్పులను నెటిజన్లు ఇట్టే గుర్తిస్తూ దాన్ని ట్రోల్ చేస్తున్నారు.
సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్
అయితే రాజమౌళి సినిమాల్లో కూడా అలా చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి కొంత మంది నెటిజన్లు ఓ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక బుల్లెట్ పై రైడ్ చేస్తూ కనిపిస్తుంటాడు. అయితే ఎన్టీఆర్ నడుపుతున్న బండి బండి వేరు వేరు నెంబర్లను కలిగి ఉండటంను ఓ నెటిజన్ గుర్తించాడు.
24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు లిరికల్ సాంగ్స్ ఇవే
అలా వేరు వేరు నెంబర్ లతో ఉన్న రెండు బండి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఒక బైక్ కి రెండు నెంబర్ ప్లేట్స్ ఎలా సార్ అంటూ రాజమౌళి ని ట్యాగ్ చేశాడు. మరో నెటిజన్ హైదరాబాద్ పోలీస్ ని ట్యాగ్ చేస్తూ రాజమౌళి పైన కేసు పెట్టాలి అంటూ ట్వీట్ చేశారు. ఇలా రాజమౌళి చేసిన చిన్న పొరపాటును పట్టుకొని ఇప్పుడు నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.