సరూర్‌నగర్ పరువు హత్యపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ముస్లింల గురించి మాట్లాడే అసద్ ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. ప్రేమ వివాహం చేసుకోవటం నాగరాజు చేసిన తప్పా..? అని నిలదీశారు. మస్లిం అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. నాగరాజు హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఎక్కడ ముస్లీంలకు ఏం జరిగినా స్పందించే అసదుద్దిన్.. ఇప్పుడెందుకు స్పందించడం లేదని నిలదీశారు. తన పార్లమెంటు పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఎందుకు ట్వీట్ చేయడం లేదని విరుచుకుపడ్డారు.
గతంలో హిందువుల మీద దాడులు చేసిన వాళ్లకు.. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన ఎమ్ఐఎం.. ఇప్పుడు నాగరాజు పరువు హత్యకు సపోర్ట్ చేస్తారా అని నిలదీశారు. నాగరాజ హత్యపై హోంమంత్రి స్పందించాలని రాజాసింగ్ అన్నారు.
కాగా… సరూర్‌నగర్‌లో నిన్న బైక్‌పై వెళ్తున్న దంపతులపై గడ్డపారతో దాడి చేయగా.. నాగరాజు మృతి చెందాడు. 2 నెలల క్రితం సయ్యద్ అశ్రిన్ ను నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. హత్యకు మతాంతర వివాహమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.