రాజస్థాన్ రాజకీయం టీ కప్పులో తుఫానులా ముగిసిపోయే దశకు చేరుకుంది. అయితే తనను గద్దెదింపే ప్రయత్నం చేసిన సచిన్ పైలట్ పై తీవ్రస్థాయిలో విరుచకపడ్డ సీఎం అశోక్ గెహ్లాట్ బలపరీక్షకు ఒక్క రోజు ముందు అసమ్మతి ఎమ్మెల్యేలకు బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు.

క్షమించండి, మర్చిపోండి… మళ్లీ మనమంతా కలిసి పనిచేద్దాం అంటూ ట్వీట్ చేశాడు. శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాట్ పై బీజేపీ అవిశ్వాస తీర్మానం తీసుకరాబోతున్న నేపథ్యంలో సీఎం ట్వీట్ వైరల్ అవుతోంది. తనకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని, తనకున్న ఇబ్బందులన్నీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించానని సచిన్ పైలట్ ఇప్పటికే ప్రకటించారు. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని తెలిపారు.