ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎవరో చేసిన తప్పు మన పాలిట ప్రమాదంగా మారుతుంది. అలాంటి ఘటనే రాజస్థాన్‌లోని భరత్‌పూర్ మార్కెట్ ఏరియాలో జరిగింది.ఇద్దరు స్నేహితులు సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంటే.. అకస్మాత్తుగా వారిపై ఓ పిల్లర్ కూలిపడింది. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. ప్రమాదం నుంచి తప్పించుకోలేక ఇద్దరిలో ఒక్క యువకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రగాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు.
#WATCH | An under-construction pillar in a market in Rajasthan's Bharatpur, collapses on a pedestrian passing by from below (16.12.2020) pic.twitter.com/N4knEBRU65
— ANI (@ANI) December 17, 2020
Advertisements
నిర్మాణంలో ఉన్న పిల్లర్ ప్రమాదవశాత్తు కూలడంతో.. ప్రమాదం జరిగినట్టు పోలసులు చెబుతున్నారు. గాయపడిన యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. ప్రమాదంపై షాపు యజమానితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.