ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, సర్పంచ్ లకు వచ్చిన వేల కోట్ల రూపాయల నిధులను సెక్యూరిటీగా చూపించి అప్పులు తెచ్చుకుంటోందని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు YVB రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్ ల పేరిట బ్యాంకులలో వేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఇది సర్పంచ్ లు చేసిన ఉద్యమం ఫలితమేనని చెప్పారు.
పంచాయతీ సెక్రటరీలకు సర్పంచ్ లతో పాటుగా జాయింట్ అకౌంట్ ఇవ్వకూడదన్నారు రాజేంద్ర ప్రసాద్. సర్పంచ్ ఒక్కనికే చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే కేంద్ర నిధుల్ని ఒక్క యూనియన్ బ్యాంక్ లోనే ఖాతా తెరిచి డిపాజిట్ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.