రాజకీయాల్లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలకు తలైవా పుల్ స్టాప్ పెట్టారు. తను రాజకీయాల్లోకి రావటం లేదని, అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు రజనీకాంత్ తన నిర్ణయాన్ని వెలువరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికలున్న నేపథ్యంలో… ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న తను, ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో అనారోగ్యానికి గురవ్వటంతో… డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇటు తన ఇద్దరు కూతుర్లు రాజకీయాలు వద్దంటూ ఒత్తిడి తేవటంతో ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
నాకు ఎంతో ఇచ్చిన ప్రజలకు ఎంతో చేయాలని ఉందని, కానీ ఇప్పుడున్న తన ఆరోగ్య పరిస్థితుల్లో రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదంటూ తలైవా తన లేఖలో పేర్కొన్నారు. తనపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు రజనీ క్షమాపణలు చెప్పారు.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020