షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి… కరోనా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న సూపర్ట్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మద్యాహ్నాం ఆయన తీవ్ర రక్తపోటు కారణంగా జూబ్లీహిల్స్ ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను వీఐపీ బ్లాకులో ఉంచి వైద్యులు వైద్య సహాయం అందించారు.
రజనీకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ… ఆయన వ్యక్తిగత వైద్యులు చెన్నై నుండి హైదరాబాద్ చేరుకున్నారు. వారి పర్యవేక్షణలోనే ఆయన చికిత్స పొందుతుండగా, శనివారం ఉదయం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ ను కలిసేందుకు ఆయన కూతురు ఐశ్వర్యతో పాటు పలువురు ప్రముఖులు ప్రయత్నించగా రజనీ వద్దని వారించినట్లు తెలుస్తోంది. ఐసోలేషన్ లో ఉన్నందున ఎవర్నీ కలిసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
తెలంగాణ గవర్నర్ తమిళి సై రజనీ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె కోరారు.