సూపర్ స్టార్ రజినికాంత్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రతి సంవత్త్సరం గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరుగుతాయి। ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుకలను ఈ సారి జరపనున్నారు. ఈ సంవత్త్సరం రజినీకాంత్ ను గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. దీనికి సంబంధించి బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. తనకి ఈ గౌరవం ఇచ్చినందుకు గాను రజిని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రజిని ఏ ఆర్ మురుగుదాస్ దర్శకత్వం లో దర్బార్ సినిమాతో ఈ సంక్రాంతికి రానున్నాడు.