సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం ఎందరికో ఆదర్శం. సినిమాల్లోకి వచ్చాక ఎంతటి స్టార్‌డం వచ్చినా సరే.. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంలా రజనీకాంత్ ఉంటున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. ఏడాదిలో కొన్ని రోజుల పాటు.. అందరికి దూరంగా హిమాలయ యాత్రకి వెళతారు.
ఇక తన బంధువులు, స్నేహితులను ప్రత్యేకంగా కలిసి.. వారితో సరదాగా గడుపుతారు. అలానే కుటుంబానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బంధాలకి తాను ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మరోసారి నిరూపించారు రజనీకాంత్. రజినీకాంత్ పెద్దన్నయ్య సత్యనారాయణ రావ్ గైక్వాడ్ 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, ఆయన భార్య లత కూడా పాల్గొన్నారు.
పుట్టిన రోజు సందర్భంగా.. అన్నయ్యపై తన ప్రేమను చాటుకున్నారు రజనీకాంత్. బర్త్‌డే రోజున.. అన్నయ్యకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు రజనీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘మా అన్నయ్య సత్యనారాయణరావు గారి 80వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనటం ఎంతో ఆనందాన్నిచ్చింది. అదే రోజున మా అన్నయ్య కుమారుడు రామకృష్ణ 60వ పుట్టినరోజు కూడా.
బంగారం లాంటి హృదయమున్న మా అనయ్యపై బంగారాన్ని కురిపించటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆయనే. అందుకు కారణమైన ఆ దేవుడికి కృతజ్ఞతలు’’ అంటూ అన్నయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు రజనీకాంత్.