ఇప్పుడు యూత్ ఐకాన్ అనగానే విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు, స్టైల్ ఐకాన్ అనగానే అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ అంటే చాలు ఇండస్ట్రీకి ఒకరు కనిపిస్తారు. ఎంత మంది వచ్చినా, ఎన్ని ఏళ్ళు గడిచినా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ స్టేటస్… వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అనే స్టేటస్ సొంతం చేసుకున్న ఏకైక హీరో తలైవా రజినీకాంత్. నాలుగు దశాబ్దాలుగా స్టైల్ ఐకాన్ గా యూత్ ని ఆకట్టుకుంటూనే ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే మనకి కనిపించే ఒకే ఒక్క పేరు రజినీకాంత్. పేరుకి తమిళ హీరోనే, మిగిలిన భాషల్లో రిలీజ్ అయ్యేది డబ్బింగ్ సినిమాలే… అయినా ఏ స్టార్ హీరోకి లేనంత ఇమేజ్ రజినీ సొంతం. అలాంటి రజినీకాంత్, రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసి రంగంలోకి దిగుతున్న సినిమా దర్బార్. కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దడంలో దిట్ట అయిన మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల స్టార్ హీరోస్ రిలీజ్ చేశారు.
ఖాకీ బట్టలు వేసుకోని, కత్తి పట్టుకోని, సూపర్ స్టార్, ఆదిత్య అరుణాచలంగా ఫైట్ చేస్తుంటే అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ మోషన్ పోస్టర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రౌడీ పోలిస్ గా రజినీ కనిపిస్తుంటే ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది అనిపించే రేంజులో ఉన్న మోషన్ పోస్టర్, బయటకి వచ్చిన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దర్బార్ మోషన్ పోస్టర్ కే ఇలా ఉంటే టీజర్, ట్రైలర్ బయటకి వస్తే రజినీ మేనియా ఎలా ఉంటుందో ఊహించొచ్చు.