సూపర్ స్టార్ రజినీకాంత్… తన స్టైల్ తో, నటనతో, డైలాగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సినీ ప్రస్థానం మొదలు పెట్టి 45 సంవత్సరాలు అవుతుంది. 1975లో అపూర్వ రాగంగళ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న వారికి ట్విట్టర్ ద్వారా రజనీ ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాల్లో నా ప్రయాణం 45 ఏళ్లుగా సాగుతోంది. నన్ను ఆదరించిన వాళ్లకు, ఈ ప్రయాణంలో తోడ్పడినవాళ్లకు, మరీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేనని ట్వీట్ చేశారు రజనీకాంత్.
ఈ సందర్భంగా మోహన్‌లాల్, పృథ్వీరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే రజినీకి శుభాకాంక్షలు తెలియజేశారు.