సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ కు వివిధ రకాలైన వైద్య పరీక్షలు డాక్టర్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే సందర్శకులు కలవడానికి మాత్రం కలవడానికి అనుమతి లేదని… ప్రస్తుతం రజినీతో ఆయన కుమార్తె ఉన్నారని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఆసుపత్రికి ఎవరూ రావద్దని రజనీ కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రజనీ ఆరోగ్యం పై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ లో పేర్కొన్నారు.