సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన… చిత్ర యూనిట్ లో ఆరుగురికి కరోనా సోకటంతో షూటింగ్ నిలిపేశారు. దీంతో ఇతర టీం సభ్యులంతా సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యారు.
తాజాగా రజనీకాంత్ హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు.