కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో భేటీ అయిన రజనీకాంత్.. ఏ విషయమూ తేల్చకుండానే ముగించారు. దీంతో ఈసారైనా రాజకీయ పార్టీ ప్రకటన ఉండొచ్చని ఎదురుచూస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది.
ఇదిలా ఉంటే రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని మాత్రం సమావేశం అనంతరం రజనీకాంత్ ప్రకటించారు.
మక్కళ్ మండ్రం కార్యదర్శులు, నిర్వాహకులతో లోటుపాట్ల గురించి చర్చించినట్లు రజనీ వెల్లడించారు. కాగా.. రజనీకాంత్ జనవరిలో పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.