తమిళ స్టార్ట్ హీరో ధనుష్ రజినీకాంత్ కాంత్ కూతురు ఐశ్వర్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్తున్నాం అంటూ చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు.
ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా మాట్లాడుతూ విడిపోవడాన్ని కుటుంబ తగాదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని తెలిపాడు. కాగా తాజాగా మరోపక్క రజనీకాంత్ సైతం వీరిని కలపడానికి ట్రై చేస్తున్నాడట.
ఇప్పటికే ఆయన ఈ విషయమై ధనుష్, ఐశ్వర్యలతో ఫోన్‌లో మాట్లాడట. ఇక 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ధనుష్ ప్రస్తుతం సార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు.