డిసెంబర్ 31కి సమయం దగ్గరపడుతుంటంతో సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటనకు చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. అయితే పార్టీ రాజకీయ చిహ్నం ఎలా ఉండాలనేదానిపై రజనీకాంత్ అండ్ కో మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా రజినీ నటించిన అన్నామలై చిత్రంలో గెటప్‌ను తలపించేలా సైకిల్, పాల క్యాన్‌తో కూడిన చిహ్నాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. పార్టీ జెండాలో మొత్తం మూడు వర్ణాలు ఉంటాయని తెలుస్తోంది.
వాస్తవానికి పార్టీ చిహ్నంగా సైకిల్‌నే ఎంపిక చేసుకున్నారని, కానీ ఇప్పటికే అదే గుర్తు కొన్ని ముఖ్యమైన పార్టీలకు ఉండటంతో దాన్ని మరికొన్ని మెరుగులుదిద్దుతున్నట్టుగా సమాచారం. అయితే రజనీ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెటప్ అభిమానులను బాగా అలరించి ఉండటంతో.. దాన్ని అలాగే వాడుకునే యోచనలో ఉన్నట్టుగా తెలిసింది. మక్కల్ మండ్రం నిర్వాహకులు ఈ చిహ్నానికి అంగీకారం తెలిపినా, తుది నిర్ణయం రజనీకాంత్ తీసుకోవాల్సి ఉంది.