సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెలాఖరున పార్టీ పేరును ప్రకటిస్తానన్న రజనీకాంత్ ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇప్పటికే పార్టీ పేరు, గుర్తుపై కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.కాగా రజనీకాంత్ తన కొత్త పార్టీకి మక్కల్ సేవై కర్చీ( ప్రజా సేవ పార్టీ ) అనే పేరును పెట్టేందుకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రజనీకాంత్ పార్టీకి ఈసీ ఆటో గుర్తును ఖరారు చేసినట్లుగా సమాచారం. తన పార్టీ గుర్తుగా బాబా లోగోను కేటాయించాలని గతంలో రజనీకాంత్ కోరారు. అందుకు ఈసీ నిరాకరించింది.
రజనీకాంత్ సైకిల్ ను తన పార్టీ గుర్తుగా ఫిక్స్ అయ్యారని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఆటో గుర్తు దక్కేలా ఉంది. రజనీకాంత్ ఆటో డ్రైవర్‌గా కనిపించిన బాషా సినిమా దేశవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇది ఆయననకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.