అందుకే హిమాలయాలకు- రజినీకాంత్

ఎట్టకేలకు తన మనసులోని మాటని బయటపెట్టాడు సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్. ‘నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే ఆథ్యాత్మిక బాట పట్టా’నని వెల్లడించాడు. రిషికేశ్‌లోని దయానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్న ఆయన.. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమేనన్నాడు.

ఆ ప్రయత్నంలోనే ఉన్నానని, తానింకా పూర్తి స్థాయి రాజకీయ నేతని కాలేదన్నాడు. ఆశ్రమంలో రాజకీయాల గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న తలైవా, ఈ ఆశ్రమానికి గతంలో చాలాసార్లు వచ్చానన్నాడు.