రజనీ రాజకీయ ఇంటర్వెల్ ! - Tolivelugu

రజనీ రాజకీయ ఇంటర్వెల్ !

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస మూవీలతో ఫాన్స్ ను మురిపిస్తున్నారు. దీంతో ఇక రాజకీయం కాస్త లేటవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఫాన్స్ తోపాటు తమిళ ఔత్సాహిక నేతలు ఎదురుచూశారు.  సూపర్‌ స్టార్‌ రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారని, కొత్త పార్టీ పెడతారని ఆయన చెప్పిన మాటలు విని ఎందరో రాజకీయ ఆశలు పెంచుకున్నారు.Rajini kanth political entry, రజనీ రాజకీయ ఇంటర్వెల్ !

ఇక రజనీ నుంచి మూవీలు రావని నిరాశ పడిన అభిమానులకు కొత్త ఆశ చిగురించింది. ‘పేట’, ‘దర్బార్‌’ చిత్రాలు వెంట వెంటనే ప్రకటించి నటించిన రజనీకాంత్ ఫాన్స్ కు హుషారు తెప్పించారు.  ఈ మధ్యనే దర్బార్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టిన రజనీకాంత్ మళ్ళీ కొత్త సినిమాపై దృష్టి పెట్టారు.

 గతంలో శివ రజనీకి స్క్రిప్టు వినిపించగా అందులో కొన్ని మార్పులు చేయమని రజనీ సూచించారట. ఈ మేరకు శివ ఇప్పడు మళ్లీ స్క్రిప్టును మార్చి వినిపించగా కథ నచ్చడంతో రజనీ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపారని కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని టాక్. ఈ నేపధ్యంలో రజనీకాంత్ రాజకీయ కార్యకలాపాలు మరికాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp