ధ్యానంలో రజినీ నిమగ్నం

ధ్యానంలో ర‌జ‌నీకాంత్ నిమగ్నం కానున్నాడు. ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేసిన ఆయన.. గురువు మహావతార్ బాబాజీ ఉపదేశించినట్లుగా వారం రోజులపాటు ధ్యానానికి సిద్ధమవుతున్నాడు. నాలుగు రోజుల కిందట చెన్నై నుండి సిమ్లాకి వెళ్ళిన త‌లైవా..ధ‌ర్మశాల‌, రిషికేష్‌తోపాటు ప‌లుపుణ్యక్షేత్రాల‌ను సంద‌ర్శించారు.


అందుకు సంబంధించిన పిక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే సిమ్లాలో రాజకీయ నేతలను కలిశారు. కొద్దిరోజుల‌లో త‌లైవా త‌న రాజ‌కీయ పార్టీ ప్రక‌టించ‌నుండ‌గా, ఆయన హిమాల‌యాలకు వెళ్లడం ప్రాధాన్యత సంత‌రించుకుంది. త‌మిళ సంవ‌త్సరాది సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ త‌న పార్టీని ప్రక‌ట‌ించనున్నాడు.