ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. సోమవారం రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మీ హఠాన్మరణం చెందారు. గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న శ్రీలక్ష్మి ప్రాణాలు విడిచారు. శ్రీలక్ష్మి ఓ జర్నలిస్ట్ ను వివాహం చేసుకుంది. వీరికి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు. కొద్దిరోజుల క్రితం దేవదాస్ కనకాల భార్య, రాజీవ్ కనకాల లక్ష్మీ, అనంతరం దేవదాస్ కనకాల, ఇప్పుడు శ్రీలక్ష్మీ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
కొన్ని కొన్ని సీరియల్స్ లో నటించి మంచి నటిగా శ్రీలక్ష్మీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మరణంతో రాజీవ్ కనకాల విషాదంలో మునిగిపోయారు. శ్మీలక్ష్మీ మరణవార్త తెలియగానే పలువురు సినీ, టీవీ రంగాలకు చెందినవారు ఆమె కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.