భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్ని గాంట్జ్ గురువారం సమావేశం అయ్యారు. న్యూఢిల్లీలో ఇరువురి మధ్య దైపాక్షిక చర్చలు జరిగాయి.
బెన్ని గాంట్జ్ గురువారం ఉదయం భారత్ కు చేరుకున్నారు. ఆయన అధికారులు ఘన స్వాగతం పలికారు. రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాల అధికారులు గాంట్జ్ కు గౌరవ వందనం సమర్పించారు.
న్యూఢిల్లీలో యుద్ధ స్మారకం వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద సైనిక అమర వీరులకు నివాళులు అర్పించడం, ఈ దేశం వారసత్వం గురించి తెలుసుకుంటూ తన భారత పర్యటనను ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.
ఇరు దేశాల మద్య 30 ఏండ్లగా రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. అంతకు ముందు భారత్ పర్యటకు బయలు దేరే సమయంలో ఆయన ఓ ట్వీట్ చేశారు.
Advertisements
‘ ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మొదలై 30 ఏండ్లు అవుతున్నందున నేను భారత్ కు వెళుతున్నాను. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలుసుకుంటాను’ అని ట్వీట్ చేశారు.