కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. రక్షణ రంగంలో ఇకపై స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మేరకు 101 వస్తువుల దిగుమతులపై ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు. తాజా నిర్ణయం రక్షణ రంగాన్ని స్వావలంబన వైపు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని రక్షణ శాఖ పరిశ్రమల అభివృద్ధికి ఊతం ఇస్తుందని.. వాటి సామర్థ్యాన్ని పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2020 నుంచి 2024 వరకు దశలవారీగా ఆయా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించనున్నట్టు రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. డీఆర్‌డీవో రూపొందించిన సాంకేతికను ఉపయోగించుకోవడానికి తాజా నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రాజ్‌నాథ్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Taking cue from that evocation, the Ministry of Defence has prepared a list of 101 items for which there would be an embargo on the import beyond the timeline indicated against them. This is a big step towards self-reliance in defence. #AtmanirbharBharat
— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020