భారత్ కు అమెరికా ఒక సహజమైన మిత్రదేశం అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన 2+2 మంత్రివర్గ సమావేశం “చాలా అర్ధవంతమైనది” అని ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
ఈ సమావేశం ఇరు దేశాల మధ్య రక్షణ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలో 2+2 మంత్రి వర్గ సమావేశంలో చాలా అర్ధవంతమైన, లోతైన చర్చ జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో పొరుగు దేశాల్లో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించాము. ఈ చర్చలతో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వివరించారు.
‘ ఇండియా, యూఎస్ మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ సమావేశం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆసక్తి ఉన్న రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయడానికి ఇది ఇరు దేశాలకు వీలు కల్పిస్తుంది’ అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.