ఆర్మీ చాపర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీకి అన్ని వివరాలు అందించారాయన.
ఇటు ఢిల్లీలోని బిపిన్ రావత్ ఇంటికి వెళ్లారు రాజ్ నాథ్. రావత్ కుటుంబసభ్యులను కలిశారు. కాసేపట్లో ఘటనా ప్రాంతానికి బయలుదేరతారని తెలుస్తోంది.