“రంజింపని రాజుగారి గది”
ఓంకార్ దర్శకుడిగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3 ఇవాళ తెలుగు ప్రేక్షకులకు వచ్చింది. రాజు గారి గది 2 మలయాళం రీమేక్ అయితే….ఈ సినిమా తమిళ రీమేక్. మొదటి రెండు భాగాలు హారర్ కామెడీగా తెరకెక్కించి సక్సెస్ సాధించారు ఓంకార్. కానీ ఈ సారి మాత్రం నిరాశనే మిగిల్చారు.
అసలు కథ ఏంటంటే..ఆటో నడుపుకునే అశ్విన్, అవికా తో ఎలా ప్రేమాయణం నడిపాడు. అవికను ప్రేమించిన వారికై పిశాచాలు దాడి చేస్తూ ఉంటాయి.వాటి దాడి నుండి ఎలా బయటపడి తన ప్రేమలో గెలవగలిగాడు అన్నదే సినిమా కథ.
ఇక ప్రథమార్థం లో ఎక్కడ కథ మీద దర్శకుడు దృష్టి పెట్టలేదు. కొంత చిరాకు తెప్పిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో అనవసర హాస్యంతో అపహస్యం చేశాడు. హారర్ కూడా పెద్దగా లేదు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు.
జానర్ : హర్రర్ కామెడీ
నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్
దర్శకత్వం : ఓంకార్
సినిమాకి ప్లస్ పాయింట్: అశ్విన్ నటన, చోట కే నాయుడు సినిమాటోగ్రఫీ, అజయ్ ఘోష్ .