రాజు ఇటు తన కూతురు మౌనిక జీవితాన్ని, అటు ఓ ఆరు సంవత్సరాల పాప జీవితాన్ని నాశనం చేశాడని రాజు అత్త యాదమ్మ మండిపడ్డారు. తన కూతురు జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడన్నారు. రాజు చచ్చి మంచి పనిచేశాడన్న యాదమ్మ… బ్రతికుండగా ప్రతి రోజు తాగి వచ్చి నా బిడ్డను చిత్ర హింసలు పెట్టాడని విమర్శించింది.
తన కూతురుకు వచ్చిన పరిస్థితి మరో ఆడబిడ్డకు రాకుడదన్న యాదమ్మ… రాఖీ పండుగకు 15రోజుల ముందు మా ఇంటికి వచ్చాడని తెలిపింది. ఇంట్లో గొడవలు కూడా జరిగాయని… నాగొంతు పట్టుకొని చంపబోతే నా కొడుకు వచ్చి అడ్డుకున్నాడని తెలిపింది. ఆ రోజు నుండి మా ఇంటికి రాలేదని, హైదరాబాద్ కు రాక ముందు సూర్యాపేటలో ఉండే వాడని… అక్కడ కూడా తాగి గొడవ చేసే వాడని తెలిపింది.