దేశంలో పెట్రో ధరల పెంపుపై రాజ్యసభను ప్రతిపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో దఫా సమావేశాలు ప్రారంభంకాగానే… కాంగ్రెస్ ఎంపీలు చమురు ధరలను తగ్గించాలని, చమురు- గ్యాస్ ధరల పెంపుపై వెంటనే చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.
ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవటంతో… సభ మొత్తంగా రెండుసార్లు వాయిదా పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ లాభం ప్రజలకు ఇవ్వకుండా, ఇప్పుడు రేట్లు పెరిగాయన్న సాకుతో ధరలు పెంచుతున్నారని ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు.
ఈ సెషన్ లో ప్రభుత్వం ప్రధానంగా… వివిధ శాఖల పద్దులపై చర్చ, టాక్స్ ప్రపొజల్స్ కు సంబంధించిన అంశాలపై చర్చించాలని యోచిస్తుంది.