రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాల ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణల్లో ముగ్గురు సభ్యుల పదవీ కాలం త్వరలోనే ముగియనుండగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 23న ఓటింగ్ నిర్వహిస్తారు..

అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించి మార్చి 5న ఇందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మార్చి 12 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. మరుసటి రోజు దరఖాస్తులన పరిశీలిస్తారు. మార్చి 15లోగా దరఖాస్తులను ఉపసంహరించుకునే వీలుంటుంది.