రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఎన్నికల తేదీని ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 10న పోలింగ్.. అదే రోజున ఫలితాలు ఉంటాయని తెలిపింది.
ఈ నెల 24న రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ కు చివరి తేదీ మే 31గా నిర్ణయించారు. ఈ 57 స్థానాల్లోని సభ్యులకు జూన్ 21తో గడువు పూర్తవుతోంది.
జూన్ 1 వరకు నామినేషన్ల పరిశీలిస్తారు. 3 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
రాష్ట్రాల వారీగా స్థానాలు
యూపీ-11
మహారాష్ట్ర-6
తమిళనాడు-6
బీహార్-5
ఏపీ-4
రాజస్థాన్-4
చత్తీస్ గఢ్ -4
మధ్యప్రదేశ్-3
ఒడిశా-3
జార్ఖండ్-2
పంజాబ్-2
ఉత్తరాఖండ్-2
తెలంగాణ-2
హర్యానా-2