రాజ్యసభ మార్చి 8వ తేదీకి వాయిదాపడింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ పూర్తవడంతో నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. అనంతరం సభను మార్చి 8కి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు తిరిగి మార్చి 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి.
వాస్తవానికి ఫిబ్రవరి 15 వరకు తొలి విడత సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ 13, 14 వ తేదీలు శని, ఆదివారం కావడంతో ఫిబ్రవరి 12నే రాజ్యసభ ముగింపు పలికారు. కాగా జనవరి 29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.