రాకేష్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి
కరీంనగర్ సీపీ ఖాకీ కాదు.. ఆయన పింకీ పోలీస్. సీపీ కోసం పింక్ కలర్ దుస్తులు, చెప్పులు, కండువా పంపిస్తున్నాం. టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక తొలగించడం ఖాయం. రాష్ట్రంలోని యువత కూడా కరీంనగర్ సీపీకి పింక్ కలర్ దుస్తులు కొరియర్ చేయాలి. పోలీసుల అహంకారం దించేలా బీజేపీ పోరాటం చేస్తుంది.
బీజేపీతో పెట్టుకుంటే అగ్గితో తలగోక్కున్నట్టే. టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కావాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం దీక్ష చేస్తుంటే పోలీసులతో సంజయ్ గల్లా పట్టించారు కేసీఆర్. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి తీరుతాం.