యూపీలో బీజేపీ సర్కార్ పై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ తీవ్ర విమర్శలు చేశారు. యూపీని ఉత్తరాఖండ్ తో పోలుస్తూ రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో వద్దో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.
ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కావాలా లేదా ఉత్తర కొరియా లాంటి పరిస్థితులు సృష్టించే రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ మనకు నియంతృత్వ ప్రభుత్వం వద్దు. అందుకే తమ ఓటును తెలివిగా ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాను.
ప్రాథమిక సౌకర్యాలైన నీళ్లు, విద్యుత్, అభివృద్ధిలపై రైతులు తరుచుగా ఆందోళన చెందుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా లేని వాళ్లకే రైతులు ఓట్లు వేస్తారని అనుకుంటున్నాను. హిందూ ముస్లిం అంటూ విభజన రాజకీయాలకు పాల్పడని వారికే వారు పట్టం కడతారని అనుకుంటున్నాను” అన్నారు.
పశ్చిమ యూపీలోని ప్రజలు అభివృద్ది గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు. హిందూ, ముస్లిం, జిన్నా, మతం గురించి మాట్లాడుతున్న వారు ఈ ఎన్నికల్లో ఓట్లను కోల్పోతారు. ముజాఫర్ నగర్ అనేది హిందూ ముస్లిం మ్యాచ్ లకు స్టేడియం కాదు అని గత వారం ట్వీట్ చేశారు.