అటు మెగాస్టార్ బర్త్ డే.. ఇటు రాఖీ పౌర్ణమి.. మెగా ఫ్యామిలీలో సంబరాలు మామూలుగా లేవు. ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట చేరి సంతోషంగా గడిపారు. తమ సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నారు.
చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్, నాగబాబు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకున్నారు మెగాస్టార్. చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.