టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా మారుతుందని, ఆమె హవా దాదాపు పదేళ్ళ పాటు ఉండే అవకాశం ఉందనే ప్రచారం కాస్త గట్టిగానే జరిగింది. ఇక ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను సినిమాల్లోకి తీసుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె వరుసగా నటించింది.
అటు గోపిచంద్ వంటి హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసి హిట్ కొట్టింది. ఐటెం సాంగ్స్ లో కూడా సందడి చేసింది. అయితే ఐరన్ లెగ్ అనే పేరు కూడా ఆమెకు రావడం కెరీర్ కు పెద్ద మైనస్ అయింది అనే చెప్పాలి. కొన్ని కొన్ని విషయాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి కూడా. ఇక కెరీర్ లో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో చిన్న చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీ అయింది.
అయితే ఆమె ఇమేజ్ డౌన్ కావడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది అంటారు కొందరు. మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాలో ఆమె కాస్త బోల్డ్ గా ఉంటుంది. ఆమె లుక్స్ కూడా కాస్త ఇబ్బంది గా ఉంటాయి ఫాన్స్ కి. ఆ సినిమా కోసం ఆమెకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ కావడమే కాకుండా ఆమె నటనపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఆమె స్టార్ హీరోల సినిమాల్లో కనపడలేదు.