ఆమధ్య కరోనా తగ్గిన టైమ్ లో సెలబ్రిటీలంతా మాల్దీవులు క్యూ కట్టారు. కొన్ని రోజుల పాటు సేదతీరి సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇంకోసారి సెలబ్రిటీలంతా మాల్దీవులు వెళ్తున్నారు. పెరుగుతున్న వేడి నుంచి తప్పించుకునేందుకు, బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు సాగర తీరాల్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా మాల్దీవుల్లో ల్యాండ్ అయింది.
కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలో ఓసారి మాల్దీవులకు వెళ్లింది రకుల్. ఆ టైమ్ లో తను మాత్రమే కాకుండా, తనతో పాటు కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లింది. బీచ్ లో బికినీతో హల్ చల్ చేయడంతో పాటు.. యోగాసనాలు కూడా వేసింది. అయితే ఈసారి మాత్రం ఈ ముద్దుగుమ్మ తను ఒక్కతే మాల్దీవుల్లో ల్యాండ్ అయినట్టు కనిపిస్తోంది.
అయితే బాలీవుడ్ జనాలు మాత్రం రకుల్ తో పాటు ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ కూడా మాల్దీవులు వెళ్లి ఉంటాడని అంచనా వేస్తున్నారు. తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన తర్వాత రకుల్-జాకీ బయటకు వెళ్లలేదు.
ఇద్దరూ తమతమ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. కాబట్టి ఈసారి ఇద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే.. మాల్దీవులు నుంచి రకుల్ పోస్ట్ చేస్తున్న ఫొటోలు మాత్రం కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి.