హీరోహీరోయిన్లకు చాలా అనుభవాలంటాయి. కానీ కొన్ని అనుభవాల్ని మాత్రం రిపీట్ చేయాలని వాళ్లు కోరుకోరు. జీవితంలో మళ్లీ అలాంటి అనుభవం ఎదురుపడకూడదని కోరుకుంటారు. రకుల్ ప్రీత్ విషయంలో కూడా అలాంటి చేదు అనుభవం ఒకటి ఉంది. అలాంటి అనుభవం మళ్లీ తనకు ఎదురు కాకూడదని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అదే కరోనా.
గత ఏడాది రకుల్ ప్రీత్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో ఆమె చాలా ఇబ్బంది పడింది. తనకు ఎదురైన ఇబ్బందుల్ని, ఆమె ఓ టాక్ షోలో బయటపెట్టింది కూడా. ఇప్పుడు మరోసారి అప్పటి చేదు జ్ఞాపకాలపై స్పందించింది రకుల్. అప్పటి అనుభవాలు తలుచుకుంటూ చాలా భయటపడింది. జీవితంలో మరోసారి తనకు కరోనా ఎదురుపడకూడదని కోరుకుంది.
థర్డ్ వేవ్ దాదాపు అంతమౌతున్న వేళ.. ప్రజలంతా విచ్చలవిడిగా మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారని.. అలాంటి వాళ్లంతా తన అనుభవం చూసి మారాలని కోరుకుంటోంది రకుల్. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని కోరుతోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉంది. జాకీతో ప్రతి రోజూ కొత్తగా ఉందని చెప్పుకొచ్చిన రకుల్.. తమ డేటింగ్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఉంటే.. ఇద్దరు ఓ మాట అనుకొని, అప్పుడు మీడియాకు చెబుతామంటోంది. పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందంటూ ఈ సందర్భంగా ప్రకటించింది రకుల్ ప్రీత్.