థర్డ్ వేవ్ టైమ్ లో తన ప్రేమ సంగతిని బయటపెట్టింది హీరోయిన్ రకుల్ ప్రీత్. హీరో-నిర్మాత జాకీ భగ్నానీతో తను ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలు కూడా రివీల్ చేసింది. లాక్ డౌన్ టైమ్ లో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నట్టు కూడా ప్రకటించుకుంది. ఆ ప్రకటనతో రకుల్, సింగిల్ కాదనే విషయం తేలిపోయింది.
అయితే ఎప్పుడైతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో ఉందని తెలిసిందో, ఇక అక్కడ్నుంచి ఆమె పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. మరో 3 నెలల్లో ఆమె పెళ్లి పీటలు ఎక్కుతుందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటుందని, ఇలా మినిమం గ్యాప్ లో ఆమె పెళ్లిపై కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన పుకారు మాత్రం మరింత క్రేజీగా మారింది. దీంతో స్వయంగా రకుల్ స్పందించాల్సి వచ్చింది.
తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియా సైట్ రకుల్ పెళ్లిపై కథనాన్ని ప్రచురించింది. ఈసారి ఓ తేదీని ప్రకటించడంతో పాటు, రకుల్ సోదరడు అమన్ ప్రీత్ ఈ విషయాన్ని నిర్థారించినట్టు చెప్పుకొచ్చింది. దీంతో రకుల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
తన పెళ్లి తేదీపై వచ్చిన కథనాల్ని రకుల్ ఖండించింది.”అమన్ నువ్వు ఎలా కన్ ఫర్మ్ చేశావ్.. కనీసం నాకు కూడా చెప్పలేదు.” అంటూ ఆన్ లైన్ వేదికగా సోదరుడిపై సెటైర్ కూడా వేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె చేసిన డాక్టర్-జి సినిమా థియేటర్లలోకి వచ్చింది. త్వరలోనే ఆమె నుంచి హిందీలో మరో 3 సినిమాలు రాబోతున్నాయి.