సినీ హీరోయిన్ సన్నజాజి తీగలాగా వంపులుండాలి. వయ్యారాల సింగారంలా ఉండాలి. టోటల్‌గా ఫిగర్ బ్యూటిఫుల్‌గా ఉండాలి. అందుకే అందాన్ని కాపాడుకునే కసరత్తుల్లో నేటి సినీ భామలు మునిగి తేలుతున్నారు. టాలీవుడ్ వయ్యారి భామ రకుల్ ప్రీత్ సింగ్ తన కసరత్తుల్ని ఇంస్టాగ్రామ్‌లో పంచుకుని మురిపించారు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రతిరోజూ వ్యాయామానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగుతుంది. తర్వాత బ్లాక్ కాఫీలో 5 గ్రాముల నెయ్యి వేసి తయారు చేసిన బులెట్ కాఫీ తాగుతుంది.
ఉదయం పూట 5 గంటల నుంచి 6.30 గంటల మధ్య వ్యాయామం పూర్తి చేస్తానని రకుల్ చెబుతోంది. ఎలాంటి ఒత్తిడి అయినా వ్యాయామం తర్వాత తగ్గిపోతుందని అంటోంది. 140 నుంచి 170 పౌండ్ల దాకా బరువు ఎత్తుతుంది.
కండ బలం పెంచేందుకు బరువులు ఎక్కువగా మోసే కసరత్తులు చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం, మాయిశ్చరైజులు రాసుకోవడం తప్పదంటోంది. బిజీ షెడ్యూల్స్ సమయంలో బ్రౌన్ రైస్, పప్పు, ఉడికించిన కూరగాయలు తీసుకుంటుంది.
రకుల్ డైట్: ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి ఏదయినా ఆహారం. మధ్యాహ్న భోజనం తప్పనిసరి. ఒక రోజు 13 వందల నుంచి 14 వందల కేలరీలకు తగినట్లు ప్రోటీన్లు, ఫాట్, కార్బోహైడ్రేట్లు ఉండేవిధంగా చూసుకుంటుంది.
సాయంత్రం 6 తర్వాత కార్బోహైడ్రేట్లు అసలు తీసుకోదట. సలాడ్స్, గ్రిల్డ్ ఫిష్, కూరగాయలతో ఆహారం రకుల్ మెనూ. వర్కవుట్స్‌కు ముందు తర్వాత గుడ్లు, జొన్న రొట్టెలు ఎక్కువగా తింటుందట.
ఇక నిద్ర విషయంలో నియమాలు ఏమీ ఉండవని రకుల్ చెబుతోంది. షూటింగ్ ఉంటే వేకువజామున 3 గంటలకే లేచినప్పటికీ షూటింగ్ లేకపోతే 24 గంటలూ నిద్రకు రకుల్ రెడీ.