ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గినప్పటికీ నిత్యం కొద్దికొద్దిగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సినీ హీరో రాంచరణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో క్షేమంగా ఉన్నానని తనతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరింది.
కాగా తాజాగా తనకు నెగిటివ్ వచ్చినట్లు రకుల్ తెలిపింది. హాయ్ ఫ్రెండ్స్ నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ,ఆదరణ కు ధన్యవాదాలు. 2021ను పాజిటివ్ దృక్పథంతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి అని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది.
Thankyou for all the love ❤️ pic.twitter.com/XwhHtMubKf
— Rakul Singh (@Rakulpreet) December 29, 2020