స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ రహస్యంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది రకుల్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తానే చెబుతానని తనపై వచ్చే పుకార్లు ఎవ్వరూ నమ్మవద్దని చెప్పుకొచ్చింది.
అలాగే తన చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయని… ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని అన్నారు.