తెలుగులు ఇటీవల కొత్త కొత్త కథలు వస్తున్నాయి. రెగ్యులర్ సినిమాలు కాకుండా ప్రేక్షకుడి అంచనాలకు అందని కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సినిమాలు హాలీవుడ్ కే పరిమితం అనుకున్నా.. ఆ స్థాయిలో ఇప్పుడిప్పుడే మన తెలుగులో వస్తున్నాయి.
ఈ క్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన రామ్ అసుర సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. గతేడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతికి ఓటీటీల్లో విడుదలై.. పెద్ద సినిమాలతో పోటీ పడుతూ మంచి రేటింగ్స్ సంపాదించుకుని దూసుకుపోతోంది.
కృత్రిమ వజ్రం తయారీపై తెరెకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ రాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి మార్కులు వేశారు. అభినవ్ సర్దార్ స్వీయనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు.
భీమ్ సిసిరోలియో కంపోజ్ చేసిన మ్యూజిక్ సినీ ప్రేమికులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పాట ఇప్పుడు కుర్రకారు ట్యూన్ గా మారిపోయింది. పీరియాడిక్ లవ్ స్టోరీతో పాటూ, కాంటెంపరరీ ప్రేమకథతో కూడిన రామ్ అసుర్ సినిమాలో ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకుడిని కదలకుండా కట్టి పడేస్తున్నాయి.